చేపట్టిన పనులు సఫలమవుతాయి. మీరు చేసే కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని గౌరవం పొందుతారు. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. గురు శ్లోకం చదవాలి.
ఈ వారం మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతీ ప్రయత్నానికి తగిన ఫలితం లభిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో చురుకుదనం ప్రదర్శిస్తే విశేషమైన విజయాలు సాధ్యం అవుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించి ఉన్నత స్థితి దిశగా అడుగులు పడతాయి. గతంలో ఏర్పడిన ఆటంకాలు క్రమంగా తొలగిపోతాయి. వ్యాపారంలో లక్ష్యసాధన స్పష్టంగా కనిపిస్తుంది, కొత్త అవకాశాలు దక్కుతాయి. ఆర్థికంగా శుభయోగం ఉండి లాభాలు పెరుగుతాయి. ధనాన్ని సద్వినియోగం చేస్తే స్థిరాస్తి వృద్ధి సాధ్యం అవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మీ నిర్ణయాలకు బలం ఇస్తుంది. విశ్వాసంతో ముందుకు సాగితే బంగారు భవిష్యత్తుకు బాటలు పడతాయి. శ్రీలక్ష్మీ ధ్యానం శ్రేయస్కరం.