కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమించాలి. బంధువుల అండదండలు ఉంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.
ధర్మబద్ధంగా పనిచేస్తే ఈ వారం విజయాలు లభిస్తాయి. ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి. అధికారులతో శాంతంగా వ్యవహరించాలి. వ్యాపారంలో ఓర్పు అవసరం, తొందరపాటు వద్దు. మిత్రుల సూచనలు ఉపయోగపడతాయి. వారాంతంలో ఒక ముఖ్యమైన పని సాఫీగా పూర్తవుతుంది. శివారాధన శుభప్రదం.