ప్రారంభించిన పనుల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. నవగ్రహ స్తోత్రం చదవండి, మంచి జరుగుతుంది.
పంచమ బృహస్పతి యోగం మంచి తెలివిని ప్రసాదిస్తుంది. స్పష్టమైన నిర్ణయాలు అవసరం. గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి జాగ్రత్త అవసరం. ఉద్యోగంలో అపార్థాలు రానీయరాదు. ప్రతిభతో గుర్తింపు పొందుతారు. వ్యాపారంలో ఏకాగ్రత అవసరం. వారాంతంలో శుభం చేకూరుతుంది. ఈశ్వర ధ్యానం శ్రేయస్కరం.