ఉద్యోగంలో అలసటను నియంత్రించాలి. వ్యాపారంలో లాభ సూచనలు ఉన్నాయి. సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకుంటే ఫలితం బాగుంటుంది. పెద్దల అనుభవ సూచనలు ఎంతో ఉపయుక్తంగా మారుతాయి. గణపతి ధ్యానం శుభఫలితాలను అందిస్తుంది.
మనోబలంతో ముందుకు సాగితే శుభఫలితాలు లభిస్తాయి. ప్రారంభించిన పనులు విజయవంతమవుతాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలున్నా ధనయోగం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. వ్యాపారంలో సహనంతో వ్యవహరిస్తే లాభం. వారం చివరలో శుభవార్త వింటారు. వేంకటేశ్వర స్మరణ మేలు చేస్తుంది.