Logo

కీలక విషయాల్లో దిగ్విజయంగా ముందుకెళ్తారు. వృత్తి, వ్యాపార రంగాల్లో మీకు అనుకూలంగా కొన్ని నిర్ణయాలు మారతాయి. ఆనందించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఇష్టదైవ స్తుతి మంచిది.

కాలం అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు, ఆస్తి సంబంధ విషయాల్లో అనుకూల పరిణామాలు ఉంటాయి. ఉద్యోగంలో క్రమశిక్షణతో పనిచేయడం ద్వారా విజయాలు సాధిస్తారు. మీ గౌరవం, ప్రతిష్ఠ పెరుగుతాయి. సహనం, శాంతం మీకు బలంగా నిలుస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. శ్రీసూర్యనారాయన నామస్మరణ శుభదాయకం.