Logo

లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి. వ్యాపారంలో కాలం అనుకూలంగా ఉంది. కీలక విషయాల్లో తోటి వారి సలహాలు అవసరం. మనోధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్త అవసరం. సూర్యారాధన శుభప్రదం.

వ్యాపారంలో అభివృద్ధి స్పష్టంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. తోటి వారి నుంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. బుద్ధి చురుగ్గా పనిచేస్తుంది. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలను తెలివితో పరిష్కరిస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు మనోబలాన్ని పెంచుతాయి. మొహమాటాలకు పోకుండా వాస్తవికంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. రుణాల విషయంలో జాగ్రత్త అవసరం. సూర్య అష్టోత్తరం చదవడం మేలు చేస్తుంది.