Logo

శ్రీలక్ష్మీ కటాక్షం బలంగా ఉంది. ఐశ్వర్య యోగం సూచితం. భూ, వాహన, గృహ విషయాల్లో పురోగతి ఉంటుంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. నిరంతర సాధన ఆర్థిక బలాన్ని ఇస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో సున్నితంగా వ్యవహరించాలి. సంభాషణలో స్పష్టత అవసరం. వారం ప్రారంభంలో శుభం జరుగుతుంది. కొందరి వల్ల పనుల్లో ఆలస్యమైనప్పటికీ మనసుకు తీసుకోకండి. కుటుంబ సహకారం మేలు చేస్తుంది. శుభవార్తలు వింటారు. సూర్యనారాయణ స్మరణ శ్రేయస్కరం.