ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీలక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాన్నిఇస్తుంది.
మనోబలం మీకు విజయాన్ని అందిస్తుంది. మిశ్రమ పరిస్థితులు ఉన్నప్పటికీ ఏకాగ్రతతో పనిచేస్తే ఆశించిన ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో మీ నైపుణ్యానికి గుర్తింపు వస్తుంది. వ్యాపారంలో అనుభవంతో తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. ఖర్చులపై నియంత్రణ అవసరం. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠించడం శుభప్రదం.