ఉద్యోగ,వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. తోటివారితో జాగ్రత్తగా మెలగాలి. ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. కీలక విషయాల్లో శాంతంగా వ్యవహరించండి. వివాదాల్లో తల దూర్చకండి. శనిశ్లోకం శుభప్రదం.
అదృష్టయోగం అనుకూలంగా ఉంది. శ్రమకు తగిన ప్రతిఫలం మాత్రమే కాదు, కొన్నిచోట్ల రెట్టింపు ఫలితాలు కూడా లభిస్తాయి. ఆర్థిక వనరులు పెరుగుతాయి. స్పష్టమైన లక్ష్యంతో కార్యాచరణ సాగించాలి. ఉద్యోగ, వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు తెలివితో తొలుగుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. శ్రీలక్ష్మీదేవి స్మరణ శుభప్రదం.