Logo

లక్ష్యాలకు కట్టుబడి పనిచేయాలి. ధర్మసందేహాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. శివారాధన శుభప్రదం.

ముఖ్యమైన కార్యక్రమాలలో కార్యసిద్ధి లభిస్తుంది. మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆశించిన ఫలితాలు దక్కుతాయి. దైవబలం మీకు తోడుగా ఉంది. వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది. అనుభవపూర్వకంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. కొత్త ప్రయత్నాలు మంచి ఫలితాలు ఇస్తాయి. పెద్దల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. మీ నిర్ణయాలు నలుగురికీ ఆదర్శంగా ఉంటాయి. ప్రతిభా పురస్కారాలు, మెప్పు లభించే అవకాశం ఉంది. భూలాభం, స్థిరాస్తి వృద్ధి సూచితం. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభం అవుతాయి. అదే రీతిలో శాంతంగా కృషి చేస్తే వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నా, వారాంతంలో శుభవార్త వినే అవకాశం ఉంది. దుర్గా ధ్యానం శ్రేయస్కరం.