ఆత్మస్థైర్యం, మానసిక బలం ఈ వారం మీకు అండగా నిలుస్తాయి. ముందుగా నిర్ణయించుకున్న లక్ష్యాల వైపు స్థిరంగా అడుగులు వేయాలి. ఒకసారి ప్రారంభించిన పనులను మధ్యలో నిలిపివేయకుండా పూర్తిచేయడం అవసరం. ఆలస్యం వల్ల అనవసర సమస్యలు పెరగవచ్చు. ముందుచూపుతో వ్యవహరించాలి. ఇతరుల వ్యవహారాల్లో ఎక్కువగా తలదూర్చకుండా మీ బాధ్యతలకు ప్రాధాన్యం ఇవ్వండి. దైవానుగ్రహం మనోధైర్యాన్ని పెంచుతుంది. వివేకంతో తీసుకునే నిర్ణయాలు కీలకమైన సమస్యలను పరిష్కరిస్తాయి. మనసులోని కొన్ని కోరికలు నెరవేరే అవకాశం ఉంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఒక ఆశయం కార్యరూపం దాల్చవచ్చు. మీ ప్రయత్నాలకు తగిన ఫలితాలు అందుతాయి. కృషి ద్వారా ఆర్థిక వనరులు సమకూరుతాయి. మాటల్లో మృదుత్వం, వ్యవహారంలో సంయమనం పాటించాలి. ఉద్యోగంలో అధికారులతో ప్రశాంతంగా మాట్లాడటం ప్రయోజనకరం. అవసరం లేని విషయాలపై స్పందించకుండా ఉండటం మంచిది. నిరంతర సాధన, క్రమశిక్షణ మీకు మేలు చేస్తాయి. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.