Logo

ఈ వారం అనుకూలమైన గ్రహబలం కొన్ని శుభపరిణామాలకు దోహదం చేస్తుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని వాటిని ఆలస్యం చేయకుండా అమలు చేస్తే ఆశించిన ఫలితాలు దక్కుతాయి. బాధ్యతలను వాయిదా వేయకుండా వెంటనే చేపట్టాలి. పనులు ప్రారంభించిన తరువాత అనవసరమైన ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా కొనసాగాలి. ప్రతికూల ఆలోచనలను పక్కనపెట్టి ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి. క్రమబద్ధమైన విధానంతో ముందుకు సాగితే భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. పట్టుదలతో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంకోచం కారణంగా మంచి అవకాశాలను వదులుకోకుండా జాగ్రత్తపడాలి. అప్పులు, అవసరం లేని వ్యయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితిలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, ధనాన్ని సక్రమంగా నిర్వహిస్తే ఇబ్బందులు తగ్గుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. కొత్త ప్రయోగాల కంటే ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం మంచిది. తొందరపాటు నిర్ణయాలకు బదులు ఆత్మీయుల సలహాలు తీసుకోవడం ప్రయోజనకరం. నవగ్రహ ధ్యాన శ్లోకాల పఠనం శుభప్రదం.