ఈ వారం అనేక విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో తీసుకున్న నిర్ణయాలను ధైర్యంగా అమలు చేయాలి. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ఉద్యోగ రంగంలో అనుకూలత పెరుగుతుంది. బాధ్యతలు లేదా అధికార పరిధి పెరిగే అవకాశం ఉంది. సహచరుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీ పనితీరుకు తగిన గుర్తింపు, గౌరవం అందుకుంటారు. నిర్ణయం తీసుకున్న తర్వాత తరచూ మార్పులు చేయకుండా స్థిరమైన వైఖరితో ముందుకు సాగాలి. ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరే సూచనలు ఉన్నాయి. స్థలం, ఇల్లు, వాహనాలకు సంబంధించిన విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకునే నిర్ణయాలు అనుకూలిస్తాయి. వారాంతంలో సంతోషాన్ని కలిగించే సమాచారం అందవచ్చు. కనకధారా స్తవం పారాయణ శుభప్రదం.