Logo

వ్యాపారంలో పురోగతి ఉంటుంది. గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. సరైన నిర్ణయాలు స్థిరత్వాన్ని ఇస్తాయి. తోటి వారి సహకారం లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికాభివృద్ధి బలంగా ఉంది. పంచమ శుక్రయోగం వల్ల గృహ, స్థిరాస్తి లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో విశ్వాసంతో పనిచేస్తే ఒత్తిడి తగ్గుతుంది. కొత్త ప్రయత్నాలకు ఇది సరైన సమయం కాదు. ఉన్నదాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. వారం మధ్యలో ఒక విషయంలో మేలు జరుగుతుంది. చంద్రధ్యానం శుభప్రదం.