అదృష్టం మీకు అనుకూలంగా ఉంది. కృషికి సరైన గుర్తింపు వస్తుంది. ధైర్యంగా వ్యవహరిస్తే అందరి ప్రశంసలు పొందుతారు. శివారాధన మంగళప్రదం.
ఈ వారం వ్యాపార, వృత్తి సంబంధమైన రంగాలలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. మీరు ప్రారంభించే పనులు విజయవంతం అవుతాయి. సమయస్ఫూర్తిని ప్రదర్శించి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ధన ఆదాయం పెరుగుతుంది, వస్తు, ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో క్రమశిక్షణతో, ఏకాగ్రతతో పనిచేస్తే ఉన్నత స్థానానికి చేరుతారు. కొందరి ప్రవర్తన వల్ల చిన్నచిన్న వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఆత్మనియంత్రణ పాటించాలి. ఆర్థిక ప్రణాళికలలో క్రమబద్ధత అవసరం. కృషిని కొనసాగిస్తే మీ ప్రయత్నం ఫలిస్తుంది. కుటుంబ విషయాలలో సానుకూల పరిణామాలు ఉంటాయి. శాంతం, ఓర్పుతో వ్యవహరించడం వల్ల అన్ని పనులు సులభంగా నెరవేరతాయి. సూర్య ధ్యానం శుభప్రదం.