ఆత్మవిశ్వాసం, అదృష్టం, ఆర్థికాభివృద్ధికి గ్రహబలం సహకరిస్తుంది. ఉద్యోగంలో మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది. గురుబలం వల్ల జ్ఞానం, వివేకంతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయోజనం కలిగిస్తాయి. గౌరవం, ప్రతిష్ఠ పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో మాత్రం బుధబలం పరిమితంగా ఉన్నందున ప్రతి వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఆదాయాన్ని పెంచే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. క్రమశిక్షణతో కొనసాగిన ప్రయత్నం విజయాన్ని అందిస్తుంది. శ్రీ వెంకటేశ్వరస్వామి స్మరణ శుభప్రదం.